గడపడగడపకూ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లాం

26 Sep, 2023 10:29 IST

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను గడపడగడపకూ తీసుకెళ్లామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే కిలారు రోశయ్య తెలిపారు. కులం, మతం పార్టీ భేదం లేకుండా పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామ‌ని చెప్పారు. ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చామ‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింద‌ని కొనియాడారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరిగింది. గతంలో ఒక్కో సర్టిఫికెట్‌ కోసం ఒక్కో ఆఫీస్‌ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు జగనన్న సురక్షతో ఒకే చోట అన్ని సర్టిఫికెట్లు అందిస్తున్నామ‌ని వివ‌రించారు.