వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా
8 Oct, 2022 11:44 IST
విశాఖపట్నం: పాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్‌లో ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు.