బినామీల కోసమే చంద్రబాబు ఆరాటం
22 Jan, 2020 10:12 IST
అమరావతి: చంద్రబాబు బినామీల కోసం ఆరాటపడుతున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కారాదు. మూడు రాజధానులను ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. టీడీపీ సభ్యుల విన్యాసాలు సర్కస్‌ను తలపిస్తున్నాయి. ఒకటి రెండు ఊళ్లను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంతటా అలాగే ఉందని రెండు పత్రికలు రాస్తున్నాయి. సీఎం వైయస్ జగన్ రాజధాని రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తున్నారు. ఎల్లోమీడియాతో చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారు. అన్ని కమిటీలు కూడా వికేంద్రీకరణనే సూచించాయి. వెనుకబాటు ప్రాంతాలపై సీఎం వైయస్ జగన్ దృష్టిసారించారు.