కాపుల విషయంలో బాబుది కపట నాటకం

29 Jul, 2019 10:32 IST


అమరావతి:  కాపుల విషయంలో చంద్రబాబుది కపట నాటకమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రం ఏ విధంగా బీసీల్లో చేరుస్తారని అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదన్నారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఎలా అణచివేశారో  అందరికి తెలుసు అన్నారు. మంజునాథన్‌ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటులో దిట్ట అయిన చంద్రబాబు కాపులను కూడా అలానే చేశారని విమర్శించారు.