వరదల సమయంలో మత్స్యకారుల సేవలు అభినందనీయం
నెల్లూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సంగం మండలం, కోలగట్ల గ్రామానికి చెందిన 140 మందిని కాపాడిన మత్స్యకారులను వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అభినందించారు. ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పిడతాపోలూరు గ్రామంలో యన్.సి.యల్.బిల్డ్ టెక్ లిమిటెడ్ సౌజన్యంతో గ్రామంలోని 1400 కుటుంబాలకు డస్ట్ బిన్లు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అర్హులైన వారందరికీ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచిందన్నారు.