నామినేషన్లపై చంద్రబాబు దుష్ప్రచారం

నెల్లూరు: నామినేషన్లపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతల నామినేషన్లను అడ్డుకుంటే వేలాది మంది నామినేషన్లు ఎలా వేశారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో వైయస్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారు. అప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?.గతంలో నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కలెక్టర్‌పై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ దాడి చేస్తే దిక్కులేదు. అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ధైర్యముంటే సోమిరెడ్డి బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే రాజీనామాకు సిద్ధంగా ఉన్నాని గోవర్ధన్‌రెడ్డి సవాలు విసిరారు.