ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం ఉంటుంది
13 Jun, 2021 13:45 IST
నెల్లూరు: ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ మందు పంపిణీకి సిద్ధమేనని ఆనందయ్య ప్రకటించారని.. సామాన్యులకు అందడం లేదని వచ్చే వార్తల్లో వాస్తవం లేదని కాకాణి అన్నారు. ఆనందయ్య ఎలాంటి సహకారం కోరుతున్నారో జిల్లా కలెక్టర్‌కి నివేదిస్తే కార్యాచరణ సిద్ధమవుతుందని ఆయన సూచించారు.
గ్రామ సచివాలయాలతో పాలనలో కొత్త ఒరవడి మొదలైందని కాకాణి అన్నారు. మ్యానిఫెస్టోలో అన్ని అంశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్నారన్నారు. టీడీపీ అనవసర రాద్ధాంతం తప్ప.. నిర్మాణాత్మక పాత్ర పోషించడంలేదని ఆయన దుయ్యబట్టారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైందన్నారు.