ఫ్యాన్ గుర్తుకు ఓటు..అభివృద్ధికి చోటు
అనంతపురం: ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి, అభివృద్ధి చోటు కల్పించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవరత్న పథకాలు, మహిళలకు జగనన్న ఇచ్చే ప్రత్యేక పథకాలు ఎంతో గొప్పవని, ఆర్ధికంగా వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని కోరారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు.మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటిస్తూ వైయస్ఆర్ సీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి , జడ్పీ చైర్మన్ , నాటక అకాడమీ చైర్మన్ , శింగనమల నియోజకవర్గం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.