శవాలపై పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు
అమరావతి: శవాలపై పేలాలు ఏరుకునే రకం చంద్రబాబుదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. సభ గౌరవాన్ని దిగజార్చుతున్న టీడీపీ నేతలను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. సభలో ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు. సహజ మరణాలను ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన వీళ్లా మద్యం గురించి మాట్లాడేది. ఈ రోజు ఈనాడు పేపర్‌లో ఎవరో? ఎక్కడో చనిపోతే దాన్ని సీరియల్‌గా కథనాలు రాసింది. దూబగుంట్లలో ఆ రోజు మద్యపాన నిషేధం గురించి రాశారే? గత ఐదేళ్లు »ñ ల్ట్‌షాపుల గురించి ఎందుకు రాయలేదు. ప్రతిరోజు చంద్రబాబు మద్యం గురించి సమీక్షలు చేసి ఆదాయాలు లెక్కలు వేయారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు సభను అడ్డుకోవడం దుర్మార్గమని, టీడీపీ నేతలకు సభలో ఉండే అర్హత లేదని, వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని జోగి రమేష్ కోరారు.