ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యత
కర్నూలు: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ తెలిపారు. కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు మండలం జి.సింగవరం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు. హెల్త్ శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే..ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అక్కడి వైద్యులతో మాట్లాడి, శిబిరానికి విచ్చేసిన ప్రజలకు అందిస్తున్న వైద్య పరీక్షలను, అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరంలో అంగన్ వాడీ కార్యకర్తలు గ్రామాల్లోని గర్భిణీలకు ఎలాంటి పౌష్ఠికాహారం ఎన్ని విధాలుగా అందిస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలల్లోనే ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత మన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ప్రదాత దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మన సీఎం వైయస్ జగన్, అందులో భాగంగా "జగనన్న ఆరోగ్య సురక్ష, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ ఆదాము, ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ నెహెమ్యా మాజీ మండల ఉపాధ్యక్షులు వాసు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మా భాష, విద్య సాగర్, అనోక్ వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.