ప్రజలు తిరస్కరించినా టీడీపీ తీరు మారలేదు
14 Mar, 2022 14:46 IST
అమరావతి: ప్రజలు తిరస్కరించినా టీడీపీ నేతల తీరు మారలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ 23 స్థానాలకు పడిపోయిందని చెప్పారు. రాజకీయ జన్మనిచ్చిన ఇందిరమ్మను, పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఆయన అధికారంలో ఉన్నన్నినాళ్లు ఎవరికి మంచి చేయాలని ఆలోచన చేయలేదు. చివరకు అంబటి రాంబాబు ఏదో అన్నారని బయటకు వెళ్లి వెక్కివెక్కి ఏడ్చారు. సభలో జోగి బ్రదర్స్ మాదిరిగా నాయుడు బ్రదర్స్‌ను ముందుర పెట్టారని ఎద్దేవా చేశారు.