ప్రజాసేవకు రాజకీయ అనుభవం అక్కర్లేదు.. సంకల్పం చాలు
7 Apr, 2022 12:22 IST
పల్నాడు: ప్రజాసేవకు రాజకీయ అనుభవం అక్కర్లేదని.. సంకల్పం చాలని నిరూపించిన ఏకైన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేటలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న పల్నాడు ప్రాంతాన్ని సీఎం వైయస్ జగన్ గుర్తించి ఇవాళ ప్రత్యేక జిల్లాగా మార్చారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే సీఎం వైయస్ జగన్ లాంటి నేత రాష్ట్రానికి ఉంటే సరిపోతుందని చెప్పారు. అహర్నిశలు శ్రమిస్తూ వలంటీర్లు ప్రజలకు సేవల్ని అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాలంటీర్లను గుర్తించి వారిని సన్మానించడం సంతోషంగా ఉందని చెప్పారు.