విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్రే
17 Jan, 2021 12:38 IST
గుంటూరు: రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం ప్రతిపక్షాల నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి అన్ని కులాలు, మతాలు సమానమేనని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.