అసెంబ్లీ పెడితే అడ్డుకుంటున్నారు
15 Sep, 2022 11:40 IST
దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చంద్రబాబు సవాలు చేశారు..అసెంబ్లీ పెడితే అడ్డుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. బీఏసీ సమావేశం నిర్వహంచకముందే ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు. వాళ్ల నాయకుడు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని సవాలు చేశారు. కానీ ఆయన మాత్రం సమావేశాలకు రాడు. టీడీపీ ఎమ్మెల్యేలను సభకు పంపించి విలువైన సమయాన్ని వృథా చేయిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2 లక్షల ఉద్యోగాలు కల్పించారు. వాళ్లు ఏం అంశాలు లేవనెత్తితే వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,ప్రతిపక్ష సభ్యులు ఒక ఫార్మెట్‌లో సభకు రావాలని హితవు పలికారు.