2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం
15 Sep, 2022 09:53 IST
అమరావతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారు. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.