పోలీసుల మృతి పట్ల ఎమ్మెల్యే ధర్మాన తీవ్ర దిగ్భ్రాంతి
23 Aug, 2021 20:10 IST
శ్రీకాకుళం: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏఆర్ పోలీసుల దుర్మరణంపై వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఆర్ ఎస్సై కె.కృష్ణుడు, కానిస్టేబుళ్లు వై. బాబూరావు, పి. ఆంటోనీ, పి. జనార్దనరావు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.