వాల్మీకిపురంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'
13 Jul, 2022 16:27 IST
చిత్తూరు : వాల్మీకిపురం మండలంలోని విఠలం గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గ్రామంలోని గడప గడపకు వెళ్లి మూడేళ్ళ కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ది గురించి వివరించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ... ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ది అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు.