ప్రజలకు మేలు చేయని పెద్దల సభ మనకు అవసరమా..?

27 Jan, 2020 17:11 IST

 


అసెంబ్లీ: ప్రజల మేలు కోసం చట్టసభలో బిల్లు ఆమోదం తెలిపి.. పెద్దల సభకు పంపిస్తే.. దాన్ని తిరస్కరించిన కౌన్సిల్‌ మనకు అవసరమా.. అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక పార్టీ ప్రతిపాదించిన రూల్‌ 71 బిల్లు మండలి ముందుకు వచ్చింది. చట్టసభలో ఆమోదించిన బిల్లు మండలి వద్దకు వెళ్లింది. చట్టసభలో ఆమోదించిన బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఒక పార్టీ ప్రతిపాదించిన రూల్‌ 71 బిల్లు చర్చకు తీసుకున్నారు. ఇలాంటి శాసనమండలి మనకు అవసరమా..? విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని కౌన్సిల్‌ అవసరమా..? ఇచ్చిన నోటిస్‌ చెల్లదు అని చైర్మన్‌ చెప్పి, సభ్యులు ఇచ్చిన నోటీస్‌ చెల్లదని చెప్పినప్పుడు చైర్మన్‌కు విచక్షణాధికారం ఎలా వస్తుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కొనుగోలుతో ఎమ్మెల్సీలను పెట్టి పెద్దల కాని పెద్దల సభ నడుపుతున్న ఇలాంటి శాసనమండలి మనకు అవసరమా..? 1995లో ఇదే శాసనసభలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచితే ఈ రోజు ఇదే శాసనమండలిలో ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి సభ మనకు అవసరమా..? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో మండలి రద్దు బిల్లు పెట్టాల్సి వచ్చింది. డెన్‌ ఆఫ్‌ డెవిల్‌గా సభ పరిస్థితిని తీసుకువచ్చారు. పబ్లిక్‌ ఇంట్రస్ట్‌గా ఉండాలనుకుంటే దాన్ని పర్సనల్‌ ఇంట్రస్ట్‌కు తీసుకువచ్చారు. అలాంటి సభ కొనసాగుతే ప్రజలకు చేసే మేలు ఏముంటుంది.

వికేంద్రీకరణ బిల్లును మనీ బిల్లుగా పెట్టి ఆమోదించాలనుకోవచ్చు కానీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి.. పెద్దల సభను గౌరవించాలని బిల్లును సభకు పంపిస్తే దాన్ని నానా రకాలుగాచేసి పెద్దల సభను దిగజార్చుతున్నారు. బిహార్‌లో చట్టసభలతో సంబంధం లేకుండా.. ఆ నాడు ముఖ్యమంత్రి తనకున్న అధికారంతో ఆర్డినెన్స్‌ తెచ్చి ఆరు నెలల వరకు కొనసాగించిన రాష్ట్రాలు ఉన్నాయి. 17 సార్లు ఆర్డినెన్స్‌ తెచ్చిన రాష్ట్రం బిహార్‌. సీఎం అనుకొని ఉంటే ఈ మూడు రాజధానుల అంశాన్ని ఆర్డినెన్స్‌ ద్వారా తీసుకురావచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే, చట్టసభలకు విలువిస్తూ.. సీఎం వైయస్‌ జగన్‌ బిల్లును మండలికి పంపిస్తే.. అలాంటి సభను కూడా తప్పుదోవపట్టించారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వనప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు మండలి రద్దు తీర్మానానికి ప్రజలంతా ఆమోదం తెలుపుతారు.