అచ్చెన్నాయుడు చెప్పింది అక్షర సత్యం
తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పింది అక్షర సత్యమని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుపై టీడీపీ నేతలు అసహనంతో ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నిలువునా కూల్చేశారన్నారు.టీడీపీ భూస్థాపితం కావడానికి సిద్ధమైందని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల దాడి డ్రామా మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును చూసి జనం నవ్వుకుంటున్నారని తెలిపారు.
లోకేష్ అసమర్ధుడని అచ్చెన్నాయుడే ఒప్పుకున్నారు.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
తిరుపతి: టీడీపీ నేత నారా లోకేష్ అసమర్ధుడని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే ఒప్పుకున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోనే చంద్రబాబు రాజకీయ పతనం ప్రారంభమైందని తెలిపారు. చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు.
ఎమ్మెల్యే పార్థసారధి:
టీడీపీ పని అయిపోయిందన్న భావన ఆ పార్టీ నేతల్లోనే ఉందని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్:
చివరికి తనపై తానే రాళ్లు వేసుకునే పరిస్థితి చంద్రబాబుకు వచ్చిందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రామాలకు ఈ రోజుల్లో ఓట్లు పడవని హితవు పలికారు.