‘జగనన్నే మా భవిష్యత్తు’కు విశేష స్పందన
24 Apr, 2023 11:10 IST
కాకినాడ: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మంచి చేసిన వాళ్లనే ప్రజలు నమ్ముతారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పగటి వేషగాళ్లు బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలకు చురకలు అంటించారు. టీడీపీ వస్తుందని అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఐదేళ్ల పాలన చేసిన అరాచకాలు, దోపిడీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు.