అభివృద్ధి లో అనంత‌పురంను అగ్రగామిని చేద్దాం

25 Oct, 2021 10:12 IST

అనంతపురం : మున్సిపల్ సిబ్బంది,కార్పొరేటర్లు అందరూ కలిసి స్నేహపూర్వక క్రికెట్ టోర్నీ  విజయవంతంగా నిర్వహించారో అదే మాదిరిగా మనం అందరం కలిసి  అనంతపురం నగరాన్ని అతి సుందర నగరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదాం అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గత కొద్దీ ర్పజులుగా కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేటర్ల కు స్నేహపూర్వక క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా ఆదివారం నాడు నగరంలోని పిటిసి మైదానంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం,రాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ నిత్యం బిజీ బిజీగా గడిపే తరుణంలో క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయన్నారు.స్నేహపూర్వక క్రికెట్ టోర్నీ ని ముందుండి నడిపించిన కమిషనర్ మూర్తి ని,సెక్రెటరీ సంగం శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అభినందించారు. అనంతరం ఫైనల్ లో విన్నర్స్,రన్నర్స్ గా నిలిచిన జట్టు సభ్యులకు ఎమ్మెల్యే అనంత, మేయర్ వసీం కలిసి బహుమతులు అందజేశారు.అంతకు మునుపు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఏఎంసీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అందులో యుగంధర్ రెడ్డి 43 బంతుల్లో 68,రఘునాథ్ 23, రామ్మోహన్ 18, పరుగులు చేశారు.కార్పొరేటర్స్ జట్టు లో బౌలింగ్ నందు చంద్రమోహన్ రెడ్డి 2 వికెట్స్ తీయడం జరిగినది.  తరువాత బ్యాటింగ్ చేసిన కార్పొరేటర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 104 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో సాకే చంద్ర  22, రాధాకృష్ణ 24, అనిల్ 12 పరుగులు చేశారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఏఎంసీ జట్టు సభ్యుడు యుగంధర్ రెడ్డి. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కార్పొరేటర్ల జట్టు సభ్యుడు రాధాకృష్ణ, బెస్ట్ వికెట్ కీపర్ గా  దాదా నిలిచారు.