ప్రభుత్వానికి వాలంటీర్లు మంచిపేరు తేవాలి

30 Oct, 2021 14:11 IST

అనంతపురం  :  ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వాలంటీర్లకు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సూచించారు. నగరంలో నూతనంగా 60 మంది వాలంటీర్లకు ఎమ్మెల్యే అనంత శనివారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవచేసే అవకాశం అందరికీ రాదని, వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. ముందుగా ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి సంక్షేమ పథకం గురించి అవగాహన చేసుకోవాలన్నారు. తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి ఫోన్‌ నంబర్లు ఇవ్వాలని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబ సభ్యుల్లా తోడుగా ఉంటాలన్నారు. అవినీతికి దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే విచారణ చేపట్టి విధుల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో ఉండాలని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని తీరు ఉండాలని తెలియజేశారు. అందరికీ ఆల్‌ది బెస్ట్‌ తెలియజేశారు.