అన్నా రాంబాబు సవాలును స్వీకరించే సత్తా జనసేనకు ఉందా?
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు సవాలును స్వీకరించే సత్తా "జనసేన"కు ఉందా ? అంటూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నా రాంబాబుపై విమర్శలు చేయడం పట్ల ఆదివారం ఎమ్మెల్యే అన్నా రాంబాబు పవన్‌కు సవాలు విసిరిన విషయం విధితమే. పోలీసు వ్యవస్థ మీద జనసేనకు నమ్మకం లేదు. నిజాయితీగా మీకు ఇష్టమొచ్చిన సంస్థలతో ఎంక్వైరీ చేయండి. నాకు, మా పార్టీ నాయకులకు వెంగయ్య మృతితో సంబంధం ఉందంటే న్యాయస్థానాల్లో లొంగిపోతాం. మొదటి రోజు ఒకమాట, రెండో రోజు మరో మాట మార్చిన మృతిని బంధువులకు నార్కోటిక్ టెస్ట్ చేయండి. అందులో తప్పులేదని తేలితే ఓ ప్రకటన ఇవ్వండి. లేకపోతే తప్పు నాదని నిరూపించండి. ఇద్దరం ప్రజాతీర్పు కోరుదాం. పవన్ కళ్యాణ్, నేను పోటీ చేద్దాం. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎలాంటి విచారణ లేకుండా న్యాయవ్యవస్థ ఏ శిక్ష విధించినా.. ఆ శిక్షను అనుభవిస్తాను. ఎవరి విధివిధానాలు ఏంటో ప్రజలను కోరుదాం. ప్రజలు పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తే పార్టీని మూసేయాలి. ఈ ఛాలెంజ్‌కు సిద్ధమైతే రేపు ప్రకటించండి.. అంటూ అన్నా రాంబాబు పవన్‌కు సవాలు విసిరారు.