ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి
17 Apr, 2024 17:22 IST
గుంటూరు: ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మంగళగిరి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. బుధవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
- ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు
- 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది
- 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను
- గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు
- రేపు కేసు విచారణ జరగబోతుంది
- అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది
- ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా?
- ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు
- తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు
- అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి
- ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి
- ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి
- మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు
- అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు
- ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది
- ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు
- ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు
- రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు
- నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు
- నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు
- అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది
- ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు
- ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి
- ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి.
- అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు
- కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది
- ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు
- రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు