ఆర్బీకే సేవలపై విదేశాలు సైతం ప్రశంసలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్బీకే సేవలపై విదేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. గురువారం సభలో ఎమ్మెల్యే మాట్లాడారు . వైయస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి, రైతు క్షేమానికి కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండా అండగా నిలుస్తోంది. గతంలో విత్తనాల నుండి పంట అమ్మకం దాకా రైతు రోడ్డుమీద నిలబడాల్సి వచ్చేది. గత ప్రభుత్వం వారికి ధాన్యం డబ్బులు చెల్లించకుండా 1000 కోట్ల బకాయిలు పెట్టిపోయింది. నేడు ఆ పరిస్థితి మారింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతుకు అందిస్తున్న సేవలను నీతి ఆయోగ్ ఛైర్మన్, భారత్ లో ఇతర రాష్ట్రాలు, ఇథియోపియా వంటి దేశాలు కొనియాడుతున్నాయి. ఇది మన ముఖ్యమంత్రిగారి దార్శనికత అనిచెప్పుకోవడం గర్వంగా ఉంది.