అదనంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం
24 Aug, 2022 11:56 IST
పార్వతీపురం: తోటపల్లి బ్రాంచ్ కెనాల్ పక్కి డిస్ట్రిబ్యూటర్ ద్వారా అదనంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఎమ్మెల్యే జోగారావు బుధవారం ఎస్జీఎల్ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఉప కాలువ పక్కి డిస్ట్రిబ్యూటర్ ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.