మహిళా అభివృద్ధి, సంక్షేమం కోసం వైయస్ జగన్ నిరంతర కృషి
చిత్తూరు: మహిళా అభివృద్ధి, సంక్షేమం కోసం వైయస్ జగన్ నిరంతర కృషి చేస్తున్నారని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. జగనన్న చేదోడు పథకం చెక్కులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికాభివృద్ధిలో ముందుకు సాగేందుకు కృషి చేస్తుందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి యువతను సీఎం వైయస్ జగన్ ఆదరించారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచమే విలవిల పోయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఒక్క చిన్న విషయంలో కూడా వెనుకడుగు వేయలేదన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆర్థిక మాంద్యం వున్న సరే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్ లకు, 108 డ్రైవర్లకు, హోంగార్డులకు, గిరిజన హెల్త్ వర్కర్లకు, సంఘమిత్ర లకు, పారిశుద్ధ్య కార్మికులకు, పలు రకాల ఉద్యోగస్తులకు గత ప్రభుత్వం కంటే జీతం పెంచడం కూడా జరిగిందన్నారు. కొన్ని విద్రోహ శక్తులు ఉద్యోగులును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.