బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ
18 Sep, 2019 16:20 IST
విశాఖ: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. మృతి చెందిన కుటుంబాల వద్దకు వెళ్లి ప్రమర్శించి, వాళ్ళ కు ప్రభుత్వ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. మంత్రి వెంట వైయస్‌ఆర్‌సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ సమన్వ యకర్త అక్కరమని విజయనిర్మల, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.