ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కుప్పం: ఈనెల 22న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పరిశీలించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అటవీ, ఇందన, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ ఎన్.రెడ్డప్ప, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, వెంకటేగౌడ్, ఎమ్మెల్సీ భరత్‌లు హెలిప్యాడ్, బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. కుప్పం పీఈఎస్ కళాశాల, బంగారునత్తం నందు హెలిప్యాడ్ ఏర్పాటు, బహిరంగ సభ నిమిత్తం ఎన్టీఆర్ స్టేడియం, అనిమిగాని పల్లి వద్ద స్థలాలను పరిశీలించారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.