వ్యవసాయ బడ్జెట్ ప్రతులను సీఎంకు అందజేసిన మంత్రులు
16 Mar, 2023 10:49 IST
సచివాలయం: 2023-24 వ్యవసాయ బడ్జెట్ ప్రతులను శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యవసాయ, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, హార్టికల్చర్ కమిషనర్ ఎస్.ఎస్. శ్రీధర్, మార్కెటింగ్ కమిషనర్ రాహుల్ పాండే, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి. శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.