ఇచ్చిన ప్రతిమాటను సీఎం వైయస్ జగన్ నెరవేర్చారు
తాడేపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిమాటను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి పేర్నినాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. వివిధ కార్యక్రమాల ద్వారా 59 లక్షల మందికిపైగా కాపులకు లబ్ధి పొందారని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైయస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. సుమారు 12వేల కోట్ల మేర కాపులకు వైయస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. కరోనా కష్టకాలంనూ సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చెప్పిన ప్రతిమాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని పేర్నినాని పేర్కొన్నారు.