నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం

24 May, 2022 18:23 IST


అమలాపురం: అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని మంత్రి విశ్వరూప్‌ సూచించారు. నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు.  రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. అమలాపురం మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి నిప్పంటించడం పట్ల మంత్రి స్పందిచంచారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండు చేసినట్లు తెలిపారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండు చేశాయని గుర్తు చేశారు. జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసిందని తెలిపారు. కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. అంబేద్కర్‌ పేరు పెట్టడంపై గర్వపడాలని సూచించారు.