అందరూ సంయమనం పాటించాలి

25 May, 2022 14:38 IST

అమలాపురం: అందరూ సంయమనం పాటించాలని మంత్రి విశ్వరూప్‌ కోరారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండదన్నారు. సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారని తెలిపారు. నిరసనకారులను నా ఇంటి వైపు దారి మళ్లించారని చెప్పారు. కార్యకర్తలను కంట్రోల్‌ చేయడంలో టీడీపీ, జనసేన విఫలమైందన్నారు. నిరసకారుల ఆందోళనల్లో రౌడీషీటర్లు చొరబడ్డారని పేర్కొన్నారు. రౌడీ షీటర్లే విధ్వంసం సృష్టించారని చెప్పారు.

ప్రతిపక్షాల కుట్ర ఉంది.. మంత్రి కారుమూరి
అమలాపురం ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. అల్లర్లను ప్రోత్సహించిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

కోనసీమ ఘటన బాధాకరం.. స్పీకర్‌ తమ్మినేని
కోనసీమ ఘటన బాధాకరమని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. జిల్లాలకు మహనీయుల పేర్లు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి ఇల్లు దగ్ధం చేయడం దురదృష్టకరమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాకే సామాజిక న్యాయం జరిగిందన్నారు.