గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీిగా మార్చింది
24 Mar, 2023 09:48 IST
అమరావతి: టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. పేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నారని, చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలోనూ ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారని చెప్పారు.