కులగణనపై సీఎం వైయస్‌ జగన్‌ సహసోపేతమైన నిర్ణయం

20 Nov, 2023 13:19 IST

విజయవాడ: ఏపీలో కులగణనకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గతంలో మంజునాధన్‌ కమిషన్‌ ఫెయిలైంది..అందుకే సీఎం వైయస్‌ జగన్‌ శాశ్వత బీసీ కమిషన్‌ వేశారని పేర్కొన్నారు. బిహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ సామాజిక ప్రయోజనాల కోసం ఏపీలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలపై సీఎం వైయస్‌ జగన్‌కు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. గతంలో ఉద్యమాలు చేసినా కులగణన ప్రక్రియలో ఫలితాలు రాలేదని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. 

పేదరిక నిర్మూలనకు సీఎం వైయస్‌ జగన్‌ కృషి: అడపా శేషు
దేశంలో తెలిసారి కులగణనకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు అన్నారు. కులగణనను రాజకీయం చేయొద్దని ఆయన కోరారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలనకు సీఎం వైయస్‌జగన్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.