కష్టం నా కులం.. మానవత్వం నా మతమన్నాడు..అదీ వైయస్ జగనంటే
విజయవాడ: కష్టం నా కులం అన్నాడు.. మానవత్వం నా మతమన్నాడు.. వ్యక్తిత్వం నా వర్గమన్నాడు.. అదీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే. అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ మహాసభలో మంత్రి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని కొనియాడారు. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి కూడా ఆయనే అన్నారు. 139 బీసీ కులాలను ఏకం చేసిన నేత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్. చంద్రబాబు నాయుడు కేవలం కుల వృత్తులకే బీసీలను పరిమితం చేయాలనుకున్నాడు. పదకొండు తరాల వెనుకబాటుకి కారణం అయ్యాడు. కానీ, సీఎం వైయస్ జగన్ అలా కాదు అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు. గంజి పేదోడి పొట్టకి, మన బట్టకి అని చంద్రబాబు గతంలో చెప్పాడు.. ఇంత మంది బీసీలను చూసి చంద్రబాబు గుండె దడదడలాడతాయి అని సెటైర్లు వేశారు. చంద్రబాబు బీసీలను కుల వృత్తుల వారీగానే చూశాడు.. బీసీలను తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తాం అన్నాడు.. బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి వైయస్ జగన్ మాత్రమే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు.