రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నాం

27 Jan, 2024 14:46 IST

తూర్పు గోదావ‌రి: రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నామ‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ తెలిపారు. పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాల‌ని మంత్రి డిమాండు చేశారు. అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేశార‌ని మండిప‌డ్డారు. బీహార్‌లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంద‌న్నారు. రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. చంద్రబాబు, పవన్ కులగణనతో భయపడుతున్నాయి, అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేద‌న్నారు.  ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నామ‌న్నారు. సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67% కులగణన పూర్తైందన్నారు. కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింద‌ని తెలిపారు. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు బయపడుతున్నార‌ని పేర్కొన్నారు. చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను మోసం చేయడానికే టికెట్లు ముందు‌ ప్రకటించారు. చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా? అని స‌వాలు చేశారు. 15 లేదా 20 సీట్లలో పవన్ దిగజారి పోటీ చేస్తారు, అంతకు మించి ఏమీ లేదన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పవన్‌ పనిచేస్తున్నాడు కానీ.. ప్రజలపై చిత్తశుద్ధి లేదని దుయ్య‌బ‌ట్టారు.