పవన్‌తో కలిసి బీజేపీ విలువలు కోల్పోయింది
5 Jan, 2021 13:04 IST
విజయవాడ: ప్రతిపక్షాలు వారి రాజకీయ స్వార్థానికి రామతీర్థం ఘటనను వాడుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం దేవుళ్లను వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పార్టీలు కూడా ఛాలెంజ్‌లు విసరడం హాస్యాస్పదమన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసిన తర్వాత బీజేపీ విలువలు మొత్తం కోల్పోయిందన్నారు. రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీఐటీ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు.