విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
9 Aug, 2020 11:38 IST
విజయవాడ: స‌్వర్ణ ప్యాలెస్‌లోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారన్నారు.