ఎమ్మెల్సీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ కోరారు. పట్టభద్రుల వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి రామచంద్రారెడ్డిలకు మద్దతుగా మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రచారం నిర్వహించారు. కల్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లలను కలిసి వైయస్ఆర్ సీపీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశీస్సులతో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి అమూల్యమైన ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు.