అర్హులైతే చాలు... మీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు
18 Aug, 2022 11:16 IST
అనంతపురం: అర్హులైతే చాలు... మీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి ఉషా శ్రీ చరణ్ అన్నారు. గురువారం అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ములకనూరు గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ వాటి అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు అభివృద్ధి పనులకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కే.వి.ఉషాశ్రీచరణ్ శంకుస్థాపన చేశారు.