పేదల ఆర్థిక బలోపేతమే సీఎం వైయస్ జగనన్న లక్ష్యం
10 Sep, 2022 17:37 IST
అనంతపురం: పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని 16 వ వార్డులో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరించారు. సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పధకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల 16వ వార్డు వద్ద ఏఐబీ పథకం క్రింద మంజూరైన ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి కనెక్షన్లు కొరకు మంత్రి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.