దళితులను టీడీపీ నేతలు దూషించడం దౌర్భాగ్యం

12 Sep, 2019 11:52 IST

అమరావతి: దళితులను టీడీపీ నేతలు దూషించడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.దళితులపై నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. దళితులను చంద్రబాబు అవమానించినట్లే..టీడీపీ నేతలంతా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పని చేసిన నన్నపనేని రాజకుమారి దళిత మహిళా ఎస్‌ఐని అవమానించడం సిగ్గుచేటు అన్నారు. దళితులనుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అవమానిస్తే..దళితులు దరిద్రమంటూ నన్నపనేని దారుణంగా వ్యవహరించారని ఫైర్‌ అయ్యారు.దళితుల పట్ల వివక్ష తగదని ఆమె హితవు పలికారు. ఎన్నికల్లో ఓడినా టీడీపీ నేతలకు బుద్దిరాలేదని దుయ్యబట్టారు.