నర్సాపురంలో ఫిషరీస్ యూనవర్సిటీ నిర్మిస్తున్నాం
అమరావతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు బియ్యపు తిప్పలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే హార్బర్ నిర్మిస్తున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 2022 నవంబర్ 21 వల్డ్ ఫిషర్ మెన్ రోజు సీఎం వైయస్ జగన్ గారి చేతుల మీదుగా హార్బర్ కి శంకుస్థాపన చేసాం. ఇదే నర్సాపురంలో ఫిషరీస్ యూనవర్సిటీ నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో ఇదే మొదటిది కాగా దేశంలో 4వ యూనివర్సిటీగా పరిగణించబడుతుందన్నారు. గురువారం సభలో మంత్రి మాట్లాడారు.
ఇప్పటివరకూ పశు సంవర్ధక శాఖ వెటర్నరీ సర్వీసులు డోర్ స్టెప్స్ వద్దకే తెచ్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వెయ్యి యానిమల్ యూనిట్స్ కి ఒక పారా వెటర్నీరియన్ ఉండేలా చర్యలు తీసుకున్నాం. 10వేల మంది యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లను రిక్రూట్ చేయటానికి ప్రయత్నిస్తే రెండు రిక్రూట్మెంలలో కలిపి 4,500 మంది వరకూ మాత్రమే రిక్రూట్ అయ్యారు. క్వాలిఫైడ్ పర్సన్స్ లేకపోవడమే కారణం. త్వరలో మిగిలిన పోస్టులూ ఫిలప్ చేస్తాం. వెటర్నరీ ఇనిస్ట్యూట్స్ ని, స్టాఫ్ ని రేషనలైజ్ చేయమన్నారు. అది పూర్తయిన తర్వాత విద్య, వైద్యంలోలాగే ఈ శాఖలోనూ నాడు-నేడు ప్రారంభిస్తాము. ఈ వార్షిక బడ్జెట్ లో పశుశంవర్థక శాఖ విభాగానికి 67.64 కోట్లు కేటాయించడం జరిగింది.
బియ్యపు తిప్ప వద్ద హార్బర్ నిర్మాణానికి కేంద్రం గ్రాంట్ ఇవ్వలేమని చెప్పింది. అయితే పాదయాత్రలో నర్సాపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు బియ్యపు తిప్పలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే హార్బర్ నిర్మించాల్సిందిగా సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. 2022 నవంబర్ 21 వల్డ్ ఫిషర్ మెన్ రోజు సీఎం జగన్ గారి చేతుల మీదుగా హార్బర్ కి శంకుస్థాపన చేసాం. ఇదే నర్సాపురంలో ఫిషరీస్ యూనవర్సిటీ నిర్మిస్తున్నాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో ఇదే మొదటిది కాగా దేశంలో 4వ యూనివర్సిటీగా పరిగణించబడుతుంది.
ఆక్వా జోనేషన్ కు సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఒక జీవో విడుదలైంది.
పొటెన్షియల్ ఆక్వా జోన్ లో ఉండాల్సిన లక్షలాది ఎకరాల ఆక్వా ల్యాండ్ నాన్ ఆక్వా జోన్ లో ఉండిపోయింది.
అయితే ఆక్వారైతులకు పాదయాత్రలో వైయస్ జగన్ రూ.1.50
కే విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చినప్పుడు, నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ హామీని కాపీ కొట్టి రూ.2 ఛార్జ్ చేస్తానని ప్రకటించి, జీవో కూడా ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా అందుకు చెల్లించలేదు. పైగా ఈ సబ్సిడీని రీయంబర్స్ మెంట్ పద్ధతిలో ఇస్తామని జీవో ఇచ్చింది. దానికి సంబంధిచి 309 కోట్లు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. జగనన్న ప్రభుత్వంలో ఫ్రెంటెండ్ సబ్సిడీగా అంటే విద్యుత్ బిల్లు వారికి ఇచ్చేటప్పుడే సబ్సిడీ వర్తింపచేసి యూనిట్ కి రూ.1.50 చొప్పున బిల్లులు ఇవ్వడం జరిగింది. 2,687 కోట్లు ఆక్వారైతులకు సబ్సిడీ రూపంగా అందించాం.