ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టం
అమరావతి: ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు చట్టం తెస్తున్నామని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆక్వా చట్టాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018 మే, జూన్ మాసాల్లో వైయస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయం అది..ఆ సమయంలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. అనేక పేపర్లు, టీవీ చానల్స్‌లో చూశాం. వైయస్ జగన్‌పై తేనె టీగలు జారీ చేశాయి. ఆ సమయంలో ప్రజలు వైయస్ జగన్‌కు రక్షణగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు వైయస్ జగన్‌ను కలిశారు. ఓ రైతు వైయస్ జగన్ వద్దకు వచ్చి ఒక మాట చెప్పారు. జగన్ బాబు మేము ఆరుగాలం కష్టపడి ఆక్వాలో పెట్టుబడి పెట్టాం. ఆక్వా పంటను అమ్మలేని పరిస్థితి. నిషేధమైనవి ఉన్నాయని మా ప్రాడక్ట్ కొనుగోలు చేయడం లేదు. లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాం. ప్రభుత్వం దీనిపై మంచి చట్టాన్ని తీసుకురావాలని ఆ రోజు ఆక్వా రైతులు వైయస్ జగన్‌ను కోరారు. ఇలాంటి సమస్యలు వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. అలాంటి సమస్యల నుంచి పుట్టుకు వచ్చిందే..ఈ ఆ ఆక్వా సీడ్ చట్టం. క్వాలిటీ ఆక్వా సీడ్‌ను ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. మన రాష్ట్రంలోని ఆక్వా రైతులందరూ కూడా సుమారు రూ.17వేల కోట్లు ఆక్వా సీడ్ వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం చాలా మంది మాన్యుపాక్చర్స్ ఉన్నారు. ప్రధానంగా మాయిచర్ , క్రూడ్ ఫైబర్, క్రూప్రోటిన్ వ్యాల్యూలో మిక్స్ చేస్తుంటారు. ఇలాంటి వాటివల్ల ఒక కిలో చేపలు ఉత్పత్తి చేయడానికి ఖర్చు అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రం మొత్తం మీదా 1.95 లక్షల హెక్టార్లలో ఆక్వా ఉంది. వ్యవసాయం 41 లక్షల హెక్టార్లు ఉంది. దీని వల్ల సుమారు 26 లక్షల మందికి ఆక్వాలో ఉపాధి చూపిస్తోంది. ఆ రోజు వైయస్ జగన్ ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. సీడ్ వ్యాపారంలో నాణ్యమైన విత్తనం అందించేందుకు ఒక చట్టం తెస్తామన్నారు. ఫిష్ సీడ్ చట్టం 2020 రూపొందించాం. ఆక్వా రైతులకు నాణ్యమైన విత్తనం అందించడమే ఈ చట్టం ఉద్దేశం. ఈ చట్టం ద్వారా ఫిష్ పీడ్ యాక్ట్ పరిధిని విస్తరిస్తున్నాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడమే కాకుండా నిషేధమైన వాటిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీ బ్రాండ్‌కు సంబంధించిన సీడ్ తయారు చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడుతోంది. ఈ చట్టంలో 28 అధ్యాయాలు పొందుపరిచాం. లైసెన్స్‌లు ఆమోదించడం, ఇవ్వడం వంటిని ఉంటాయి. దీనికి ఫిషరీస్ కమిషనర్ ఉంటారు.