చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి
1 Dec, 2020 15:51 IST
అసెంబ్లీ: స్పీకర్‌పై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబు వెంటనే శాసనసభకు క్షమాపణ చెప్పాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన స్పీకర్‌ను ఉద్దేశించి వేలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలన్నారు. అసెంబ్లీలో మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 50 శాతం మంది వెనుకబడినవర్గాలు సభను చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బలహీనవర్గాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పెద్దపీట వేస్తూ తన కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు కేటాయించారు. ఇది చూసి చంద్రబాబు ఓర్వలేక కుమిలిపోతున్నాడు. సభకు క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబుకు తగిన రీతిలో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు.