క్షమించమని లోకేష్ ప్రజల్ని అడిగితే ఇంకా బాగుంటుంది..!!
తాడేపల్లి: చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని గడప గడపకు వెళ్లి ప్రతి మనిషికి చెబుతామన్న నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల్ని క్షమించమని నారా లోకేష్ అడిగితే ఇంకా బాగుంటుందని మంత్రి ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు. చంద్రబాబు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి తెలియజేస్తుంటే మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతాము అని చెప్పినందుకు నారా లోకేష్‌కు థాంక్యూ.. ఇప్పటికైనా మీ తండ్రి చేసిన తప్పుల్ని, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడమే కాదు ప్రజల్ని క్షమించమని అడిగితే ఇంకా బాగుంటుంది.. అంటూ మంత్రి రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.