చంద్రబాబు ప్లాన్ ప్రకారమే పట్టాభి వ్యాఖ్యలు
21 Oct, 2021 12:26 IST
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్లాన్ ప్రకారమే ఆ పార్టీ నేత పట్టాభి సీఎం వైయస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గొడవలు సృష్టించాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. చంద్రబాబు వయస్సుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును చూసి ప్రజలు అసహ్యంచుకుంటున్నారని తెలిపారు.