ఆర్థికసాయం కోసం ఆటో, ట్యాక్సీవాలాలు దరఖాస్తు చేసుకోండి

12 Sep, 2019 16:00 IST

అమరావతి: వచ్చే నెల 4వ తేదీ నుంచి ఆటో, ట్యాక్సీవాలాలకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఫైనాన్స్‌తో వాహనాలు తీసుకున్న వారికీ పథకం వర్తిస్తుందని తెలిపారు. కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవాలని లబ్ధిదారులను కోరుతున్నామన్నారు.