విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎంతో చర్చించాం
9 Aug, 2023 16:29 IST
విజయవాడ: విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం వైయస్ జగన్‌తో చర్చించామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. వారి డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తామని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం మంత్రుల సబ్ కమిటీ సమావేశం ఉందని, ఉద్యోగుల సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తామని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.